Tuesday 18 August 2015

ప్రయత్నం

నిరాశ నిన్ను కమ్ముకున్నా
నిశిలో నువ్వు బ్రతుకుతున్నా.. 

లోకం నిన్ను నమ్మకున్నా
శోకం నిన్ను అలుముకున్నా.. 

కష్టం నిన్ను వదలకున్నా
గమ్యం దరికి రానుఅన్నా..

ఆరని జ్వాల నీవైతే ఆటంకాల మంచు కరగదా..
ఆగని ప్రయత్నం నీదైతే కోరిన విజయం దక్కదా..!!


Express yourself

కలం కదిలితే కావ్యం అవుతుంది.. 
గళం విప్పితే గానం అవుతుంది..
రూపం ఏదైనా భావం బయట పడుతుంది..
లోకం ఏమన్నా మనసు తేలికవుతుంది..!!
Express Yourself  :)















తొలిసారీ మిమ్మల్ని చూసింది మొదలు...

జలపాతాలు నల్లగా ఉంటాయని తెలీదు..  నీ కురులు చూసే వరకు..!!
కలువలకు కవలలు ఉంటాయని తెలీదు.. నీ కళ్ళు చూసే వరకు..!!

గుండెకు సందడి తెలీదు నీ నవ్వు చూసే వరకు..!!
మువ్వకు సవ్వడి తెలీదు నీ పాదం చేరే వరకు..!!

నాలో కవి ఉన్నాడని తెలీదు నీ అందం చూసే వరకు..!!
అసలు అందానికి అర్థం తెలీదు నిన్ను చూసే వరకు..!!

తీపికి కొలమానం ఆ స్వరం
తెలుపుకు తార్కాణం తన వర్ణం..!!

ఎన్ని రోజులు నిద్ర మానాడో  నీకొసం
అందుకే ఆ బ్రహ్మకు నేను దాసోహం..!!

నీతో పరిచయం నా తక్షన కర్తవ్యం
ఆపై మన ప్రయాణం ఓ చెరిగిపోని చరితం..!!