Tuesday 4 October 2016

                                       ఒక గానము ఒక గీతము
                                                              - మిత్ర గూటూరు
(ఒక లాలన ఒక దీవెన బాణీలో...)

ఒక గానము
ఒక గీతము
లేచొచ్చెనే మా ప్రాణము

ఒక భాస్కరం
ఒక శంకరం
రచియించెనే మధు సంతకం

కళ్యాణ రాముని చేతిలో మహిమున్నదో అసలేమో
కల్యాణి రాగము వాడుతూ తియతియ్యగా స్వరపరిచెనో

ఒక గానము....(1)

ఇంతకాలం చూడలేని కమ్మని మాయని
ఆడియన్సేమ్ ఆపలేదే వద్దనీ

లిరిసిస్టు సిరలో కవితనీ
వెలితీయు బాధ్యత నాదనీ
ఆ స్వేచ్ఛనే అందించినా మా శ్రీనినాపేదెవరని!

ఒక గానము....(1)

పోల్చలేని గ్యాపు ఉంది నాటికి నేటికీ
శ్రీనిగారే రాయబారం వాటికి

కథ ఉంటె అందరు చూడరా
అది లేని హంగులు దండగ
ఈ సూత్రమే అమలైనచో మన తెలుగు సినిమా పండుగా ..

ఒక గానము ఒక గీతము లేచొచ్చెనే మా ప్రాణము..!!
-మిత్ర గూటూరు